నిర్మల్, 9 September
ప్రభుత్వం చెల్లించాల్సిన స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్లోని దీక్ష డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం పిలుపు మేరకు ఈ ఆందోళన జరిగింది.
స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి దీక్ష డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నిరసన నిర్మల్: తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ఉద్యమ కార్యాచరణలో భాగంగా, ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సీహెచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మెంగ శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.












