నాగభూషణ విద్యాలయం, భైంసా, నిర్మల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
భైంసాలో మోహనరావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్‌రావు పటేల్ జన్మదిన వేడుకలు నాగభూషణ విద్యాలయంలో ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ జారికోట్ బాబురావు, ప్రధానోపాధ్యాయురాలు సులోచన ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
నాగభూషణ విద్యాలయంలో ఘనంగా బోస్లే మోహన్‌రావు పటేల్ జన్మదిన వేడుకలు భైంసా: మోహనరావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్‌రావు పటేల్ జన్మదిన వేడుకలను నాగభూషణ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జారికోట్ బాబురావు, ప్రధానోపాధ్యాయురాలు సులోచన ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు బోస్లే మోహన్‌రావు పటేల్‌కు ఘన స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.











