నిర్మల్, 8 September
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భైంసా నుంచి హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలపై పీస్ కమిటీ సమావేశం కలెక్టర్ భవేష్ మిశ్రా ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి భైంసా నుంచి హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో కు బయలుదేరి హాజరయ్యారు. హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, ఉత్సవ కమిటీలు సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. గణపతి బప్పా మోరియా!












