కనగల్, 7 September
నల్లగొండ జిల్లా మండలం కురంపల్లి గ్రామంలోని శ్రీరామ కాలనీలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కుల పెద్దమనిషి గోలి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
కురంపల్లిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు , సెప్టెంబరు 7 ( నల్లగొండ జిల్లా మండలం కురంపల్లి గ్రామంలోని శ్రీరామ కాలనీలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కుల పెద్దమనిషి గోలి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో శ్రీరామ కాలనీ మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి డప్పువాయిద్యాల నడుమ ముత్యాలమ్మ ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. కుల పెద్దమనిషి గోలి ఆంజనేయులు ఆధ్వర్యంలో వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో బుట్టి నరసింహ, కోరెక్క బలరాం, ఒలికి కిరణ్, సీఐ వెంకటేశ్వర్లు, కొంగల యాదయ్య, ఒలికి కళ్యాణ్, పంబాల నరసింహ, కొంగల రాజేష్, కొంగల రమేష్, పంబాల సునీల్‌కుమార్, బుట్టి ముత్యాలు పంబాల పెద్ద రాంబాబు.తదితరులు పాల్గొన్నారు. మహిళలు, ఆడపడుచులు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో శ్రీరామ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. డప్పువాయిద్యాల సందడి మధ్య బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించిన ముత్యాలమ్మ బోనాల వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.


