నిర్మల్, 8 September
జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామంలోని రాధ కృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ముగిసిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు. జిల్లా, సారంగాపూర్: మండలంలోని చించోలి(బి)గ్రామంలోని రాధ కృష్ణ ఆలయంలో శుక్ర,శని, ఆదివారాల్లోశ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీ కృష్ణ జననం,నామకరణం శనివారం తులాభారం,ఆదివారం ఉట్టి, పాకరు గుంజ కార్యక్రమం లు అంగరంగ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు.












