తెలిపిన (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజలు, నిర్వాహకులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పరస్పర సహకారం, ఐకమత్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు, నిర్వాహకులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణహిత నిమజ్జనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విద్యుత్, అగ్నిప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాలను అధికారుల సూచనల మేరకు నిర్దేశిత ప్రదేశాల్లోనే సురక్షితంగా నిర్వహించాలని, ప్రజలు సంయమనం పాటిస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోరారు.












