బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
మండలం మాటేగాం గ్రామంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటుడు బాపనపల్లి వెంకటస్వామి సెప్టెంబరు 15న హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన అభినవ రావణబ్రహ్మ పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.
మాటేగాం గణపతి వద్దకు ప్రముఖ నటుడు బాపనపల్లి వెంకటస్వామి సెప్టెంబరు 15న ప్రత్యేక కార్యక్రమానికి రాక మండలం, మాటేగాం: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలం మాటేగాం గ్రామంలో నిర్వహిస్తున్న గణపతి వేడుకలకు ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటుడు, ప్రఖ్యాత మేకప్ కళాకారుడు, నంది అవార్డు గ్రహీత “అభినవ రావణబ్రహ్మ” బాపనపల్లి వెంకటస్వామి సెప్టెంబరు 15న విచ్చేయనున్నారు. మాటేగాం గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణపతి మండపం వద్ద బాపనపల్లి వెంకటస్వామి రావణబ్రహ్మ పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి భక్తులను, కళాభిమానులను అలరించనున్నారు. ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటుడి రాకతో మాటేగాం గణపతి ఉత్సవాలకు మరింత ప్రత్యేకత చేకూరనుందని నిర్వాహకులు తెలిపారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తిలకించేందుకు మాటేగాం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు.












