మండలంలోని బోరిగాం తండాలో వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తండా పెద్దమనుషులు, యువకులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులు, గ్రామస్థులకు అన్నదానం చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తండావాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో తండాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.











