ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో వ తేదీన సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శనం కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ బస్సును నడపనున్నట్లు డిపో మేనేజర్ కే.పండరి తెలిపారు. ఈ యాత్ర ద్వారా మొత్తం 6 జ్యోతిర్లింగాలు, 14 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో గల దేశంలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శనం కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే.పండరి తెలిపారు.
ఈ యాత్ర ద్వారా మొత్తం 6 జ్యోతిర్లింగాలు, 14 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఆర్టీసీ కల్పిస్తుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
దర్శనీయ పుణ్యక్షేత్రాలు
ఈ యాత్రలో భాగంగా మహారాష్ట్రలో గల ఔండా నాగ్ నాథ్, భద్ర మారుతి, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా, శని సింగ్నపూర్, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం; గుజరాత్ లోగల నిష్కాలన్ష్ మహాదేవ్ మందిర్ (సముద్రంలో ఉంటుంది), సోమనాథ్ జ్యోతిర్లింగం, ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన రాజ్యం, నాగ నాగేశ్వర్ జ్యోతిర్లింగం; మధ్య ప్రదేశ్ లో గల ఉజ్జయిని జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం వంటి ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మార్గమధ్యంలో ఉన్న ఇతర ఆలయాలను కూడా సందర్శించవచ్చు.
ఈ బస్సు నుండి బయలుదేరి, తిరిగి చేరుకుంటుంది. ఈ 7 రోజుల యాత్రకు ఛార్జీ ఒకరికి రూ. 8,640/- గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 9959226003, 9440018549 నంబర్లలో సంప్రదించాలని డిపో మేనేజర్ కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ మహాశివుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.












