మండలం పరిధిలోని వడ్ ఝరి గ్రామంలో హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి 45 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
గ్రామస్తులు చేసిన విన్నపం మేరకు ఈ నిధులను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిధుల మంజూరుకు సంబంధించి జీవోను విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి, ప్రభుత్వానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిధులతో వడ్ ఝరి గ్రామంలోని హనుమాన్ మందిర పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.












