నిర్మల్ జిల్లా మండలంలోని బోసి గ్రామంలో 63 ఏళ్లుగా ప్రత్యేక సంప్రదాయంతో జరుగుతున్న శ్రీ వరసిద్ధి కర్ర వినాయక ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను గ్రామపంచాయతీ సర్పంచ్, గణేష్ మండలి ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రత్యేకతను, సంప్రదాయాన్ని కలెక్టర్‌కు వివరించారు.
నిర్మల్ జిల్లా మండలంలోని బోసి గ్రామంలో 63 ఏళ్లుగా ప్రత్యేక సంప్రదాయంతో కొనసాగుతున్న శ్రీ వరసిద్ధి కర్ర వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకోవాలని కోరుతూ గ్రామపంచాయతీ సర్పంచ్, గణేష్ మండలి ఉత్సవ కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా బోసి గ్రామంలోని శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడి ప్రత్యేకతను, 63 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కలెక్టర్‌కు వివరించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ, గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ఉత్సవాలకు హాజరై శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడిని దర్శించుకోవాలని కోరుతూ ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పసుల గంగసాగర నాగనాథ్, గణేష్ మండలి అధ్యక్షులు ఉత్తం బాలేరావ్ మహారాజ్ అప్ప, ఉప సర్పంచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












