మిర్యాలగూడ పట్టణంలోని 22వ వార్డులో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా వార్డు కౌన్సిలర్ పద్మశెట్టి లక్ష్మీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు, వార్డు ప్రజలకు స్వయంగా అన్నం వడ్డించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ, వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా భక్తి, సేవాభావంతో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో . యూసుఫ్, అంగోతు హతిరాంనాయక్, పెండ్యాల పద్మావతి, సోము సైది రెడ్డి, కూరపాటి సాంబశివరావు, కిరణ్, అంజి, లచ్చునాయక్, మనోహర్, వార్డు ప్రజలు, భక్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












