నిర్మల్, 15 September
జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్లో గత ఏడుఎనిమిది సంవత్సరాలుగా జై సేవలాల్ బంజారా యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బంజారా సోదరులంతా ఏకమై గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటూ తమ ఐక్యతను చాటడంతో పాటు బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తున్నారు.
*బంజారా సోదరుల ఐక్యతకు ప్రతీకగా గణేశ్ ఉత్సవాలు* : జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్లో గత ఏడు–ఎనిమిది సంవత్సరాలుగా జై సేవాలాల్ బంజారా యూత్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బంజారా సోదరులంతా ఏకమై గణేశ్ ఉత్సవాల్లో పాల్గొంటూ తమ ఐక్యతను చాటడంతో పాటు బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తున్నారు. అదిలాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వైద్య, ఆసుపత్రి, ఇతర రంగాల్లో పనిచేస్తున్న బంజారా సోదరులు సైతం ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకుని అందరూ సమన్వయంతో ఏడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రియదర్శిని నగర్ కాలనీవాసులు కూడా బంజారా సోదరులకు ఉత్సాహం నింపుతూ, అన్ని కార్యక్రమాల్లో అండగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం బంజారా సోదరులంతా ఒకే వేదికపై ఏకమై గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం జిల్లా కేంద్రంలో ప్రత్యేకతగా నిలుస్తోంది. ఐక్యత, సేవాభావం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.











