జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి వేడుకలను సిద్దిపేట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద బీసీ ఎస్టీ జేఏసీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఆయన ఆశయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు నెమలి సుభాష్, ఉపాధ్యక్షుడు ప్రభురాజ్ పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వంతో పాటు మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయ రాములు, కార్తీక్‌రెడ్డి, సంపత్, టి.రవి, తేల్జేరు శ్రీనివాస్, నాగేష్, రాజాగౌడ్, రాంగోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.












