ముధోల్ మండల కేంద్రంలో వీవీడీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వీవీడీసీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












