కోకాపేట, నార్సింగి, రంగారెడ్డి, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తున్న ఇంటర్ విద్యార్థి మదన్‌మోహన్‌రెడ్డి (17) మృతిచెందాడు. ఈ ఘటనలో కారులో ఉన్న మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి ముందు విద్యార్థులు మద్యం సేవించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నార్సింగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి నార్సింగి: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన నార్సింగి పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి (17) స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన ఇన్నోవా కారులో బయలుదేరాడు. వేడుకల అనంతరం స్నేహితులతో కలిసి కోకాపేట వైపు వెళ్లారు. తెల్లవారుజామున కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మదన్‌మోహన్‌రెడ్డి డోర్ నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం సేవించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











