నిర్మల్, 13 September
భైంసా మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు మహారాణా ప్రతాప్ యూత్ సభ్యులు సంఘీభావం తెలిపారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు దీక్ష కొనసాగుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు.
ఐదో రోజుకు చేరిన కాంట్రాక్టర్ల రిలే నిరాహార దీక్ష జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ భైంసా: భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. కాంట్రాక్టర్ల ఆందోళనకు మహారాణా ప్రతాప్ యూత్ సభ్యులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకు మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి హామీ రాలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం కోసం యువజన సంఘాలు ఏకమై పూర్తి మద్దతు అందించాలని మహారాణా ప్రతాప్ యూత్ సభ్యులు పిలుపునిచ్చారు.












