గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై వార్తా కథనాలు రాసిన సీనియర్ జర్నలిస్ట్ బసవరాజుపై కేసు నమోదు చేయడాన్ని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారానికి ఎమ్మెల్యే పీఏ కారణమని ఆరోపణలున్నాయి.
మండలం తాడెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై వార్తా కథనాలు రాసిన సీనియర్ జర్నలిస్ట్ బసవరాజుపై కేసు నమోదు చేయడాన్ని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న పరిణామాలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి వెలువడిన వార్తల నేపథ్యంలో జర్నలిస్ట్‌పై అక్రమకేసు నమోదు కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పీఏపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులకు తమ విధులు స్వేచ్ఛగా నిర్వహించే అవకాశం కల్పించాలని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడడం శోచనీయమని అన్నారు. సంఘటన పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












