జర్నలిస్టు బసవరాజుపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రసార మాధ్యమాలు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నాయని అన్నారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలపై వార్తా కథనం అందించినందుకే స్టాఫ్ రిపోర్టర్ బసవరాజుపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం, పోలీసు అధికారులు ఫిర్యాదుల్లోని వాస్తవాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం వల్ల వారి విధులకు ఆటంకం కలుగుతుందని ఆయన అన్నారు.
బసవరాజుపై నమోదైన కేసులను పునఃపరిశీలించి, న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పాత్రికేయులపై ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు.












