హుజురాబాద్ పట్టణం, హుజురాబాద్, జగిత్యాల, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
హుజురాబాద్ నియోజకవర్గంలో రాజీనామా చేసి గెలిచే దమ్ము ఉందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సవాల్ విసిరారు. కొండగల్‌లో కాకుండా హుజురాబాద్‌లో రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని ఆయన అన్నారు.
కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?.. వొడితల ప్రణవ్ సవాల్ హుజురాబాద్, సెప్టెంబర్ 8 ( హుజురాబాద్ నియోజకవర్గంలో రాజీనామా చేసి గెలిచే దమ్ము ఉందా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సవాల్ విసిరారు. కొండగల్‌లో కాకుండా హుజురాబాద్‌లో రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రణవ్ మాట్లాడారు. అసెంబ్లీ అంటే దేవాలయమని, అలాంటి పవిత్రమైన సభలో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని విమర్శించారు. దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ కన్నీరు పెట్టుకోవడం బాధ కలిగించిందని ప్రణవ్ అన్నారు. మహిళల పట్ల గౌరవం కలిగిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పోల్చుకునే స్థాయి కౌశిక్‌రెడ్డికి లేదని, ఆయన వ్యవహారశైలిపై హుజురాబాద్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. దళిత బంధుపై ఆరోపణలు దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు అందకుండా అడ్డుకున్న వ్యక్తి కౌశిక్‌రెడ్డి అని ప్రణవ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దళితులపై కపట ప్రేమ చూపించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో నిధుల విడుదలకు సంబంధించిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దళిత బంధు నిధుల విషయంలో కౌశిక్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రణవ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలపై వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు ప్రణవ్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 18 వేల నూతన రేషన్ కార్డులు, 23 వేల అదనపు రేషన్ కార్డులు అందజేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశామని, 31,158 మంది రైతులకు రూ.243 కోట్లతో రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశామని వివరించారు. రైతు భరోసా ద్వారా 73 వేల మంది రైతులకు రూ.71 కోట్ల నిధులు అందించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












