బాసరలోని (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
గ్రామస్థాయి నుంచి ఎదిగిన యువతను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మమ్మాయి రమేష్ అన్నారు. బాసర గ్రామానికి చెందిన సుద్దుల గంగాప్రసాద్కు రాష్ట్ర ఎన్ఎస్యూఐ కార్యదర్శిగా బాధ్యతలు దక్కడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
యువతను నాయకులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ లక్ష్యం బాసర, సెప్టెంబరు 8: గ్రామస్థాయి నుంచి ఎదిగిన యువతను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మమ్మాయి రమేష్ అన్నారు. బాసర గ్రామానికి చెందిన సాధారణ కుటుంబ యువకుడు సుద్దుల గంగాప్రసాద్కు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్ఎస్యూఐ కార్యదర్శిగా నియమితులైన సుద్దుల గంగాప్రసాద్ను మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యువతకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చిన సామాన్య యువకులు సైతం రాష్ట్రస్థాయిలో నాయకులుగా ఎదిగేలా అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. గంగాప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరావు దేశ్ముఖ్, పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్ దేశ్ముఖ్, జలీల్, జంగం రాజేందర్, నాగరాజు, శ్రీనుపటేల్, శంకర్, అశోక్, ఆస్టం దేవన్న, భోజన్న, దేవేందర్ తదితరులు పాల్గొని గంగాప్రసాద్ను సన్మానించి అభినందించారు.












