కుంటాల, 10 September
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందజేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు కేసు నమోదు చేయాలని పోలీసులకు : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరే ఆనంద్‌రావు పటేల్ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన శాసనసభ స్పీకర్ పదవిని గౌరవించాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












