నిర్మల్ జిల్లా మండలంలోని బోర్గావ్ గ్రామంలో సిందే సుభాష్ కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో భైంసా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హెచ్. పుండ్లిక్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పవార్ సాయినాథ్, వడగావ్ సర్పంచ్ కదం గోవింద్ రావు పటేల్, ఉమ్రికే సర్పంచ్ మారుతి పటేల్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.







