కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ప్రాణహిత నీటి లభ్యత ఉన్నప్పటికీ, ప్రస్తుతం 20 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతోందని వారు తెలిపారు.

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు
ఇప్పటికైనా కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని, కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్లను ఆన్ చేసి, నీటిని ఎత్తిపోసి, సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు వినియోగించి రాష్ట్రాన్ని కరువు నుంచి కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.