సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని చౌడారం గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎదుగని లహరి (టినా) మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. ఈ పండుగలు ప్రజల్లో ఐక్యతను, సంతోషాన్ని పెంపొందిస్తాయని ఆమె తెలిపారు. చౌడారం గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల శుభాకాంక్షలు ఆమె తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చౌడారం గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రం నవీన్‌తో పాటు గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.











