బోథ్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల ఐక్యత, సోదరభావం, ప్రజాస్వామ్య విలువలను చాటిచెప్పే ఈ రోజును ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ చరిత్రలో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి నేటి వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం పడిన ఉద్యమకారులు, అమరవీరులు, ప్రజల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం, స్వాభిమానం, హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ ఐక్యత, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అభివృద్ధి అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేందర్ యాదవ్, రమన గౌడ్, తాహెర్, ప్రశాంత్, ప్రవీణ్, రాజు రెడ్డి, సుభాష్, ప్రీతం రెడ్డి, దేవేందర్ రెడ్డి, రఫీ, సుజీల్ తో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












