నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మోహాల గ్రామంలో బుధవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్థులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ మామిడి మమతా భాస్కర్, ఉపసర్పంచ్ వై. గంగాధర్, గ్రామ పెద్దలు గంజాయి పోశెట్టి, దండె రమేష్, గంజాయి ముత్తన్న, దండె నారాయణ, బక్కొళ్ల సుధాకర్, అర్ల జీవరత్నం, ముజ్జిగి బాబు, చిన్నవారు వినేష్, బుజ్జిగె గంగాధర్, బతుర్ల రవీందర్, గంజాయి శివకుమార్, మురళీధర్, దండె నారాయణ వార్డు సభ్యుడు దండె విజయ్, అర్ల సరిత, డాన్స్ మాస్టర్ దండె రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో బతుకమ్మ సంబరాలు సంప్రదాయాల పరిరక్షణకు, గ్రామ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
మోహాల గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: గోదావరిలో బతుకమ్మల నిమజ్జనం
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మోహాల గ్రామంలో బుధవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా మహిళలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్థులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
- అనంతరం బతుకమ్మలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,956వ్యూస్