సమావేశం (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 13
సారంగాపూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య అధికారుల నిర్లక్ష్యం, కొందరు సర్పంచులు మాత్రమే హాజరుకావడంతో సాదాసీదాగా ముగిసింది. విద్యుత్, ఉపాధి హామీ, హరితహారం వంటి అంశాలపై అధికారుల నివేదికలు, వారి హాజరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతీ మూడు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వంటి అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య మండల కేంద్రంలో రైతు వేదికలో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు అధ్యక్షతన సాదాసీదాగా జరిగింది. ఈ లో గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని చదివి వినిపించారు.
అధికారుల తీరుపై అసంతృప్తి
ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు వచ్చేలా చూడాలని అధికారులు తెలిపారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచు కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. విద్యుత్, ఉపాధి హామీ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచుల ముందు వారి వద్ద ఉన్న సమాచారాన్ని అందించారు.
సర్పంచుల నిరసన
కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడం, 32 గ్రామ పంచాయతీల సర్పంచులలో కొందరు మాత్రమే హాజరు కావడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చామా, వెళ్ళామా అన్నట్లుగా ప్రతీసారి నిర్వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ లింగయ్య, డిప్యూటీ తాసిల్దార్ రామచందర్, ఎంపీ ఓ అజీజ్ ఖాన్, ఎం ఈ ఓ మహేందర్, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.






