నిర్మల్, 13 November
తెలంగాణలో పశుగ్రాసం కొరతతో పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని అల్లోల దివ్యా రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రోజుకు 30 లక్షల లీటర్ల పాల అవసరం ఉండగా, ప్రస్తుతం 27 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
365 కరువు మండలాల్లోని రైతులకు అండగా నిలిచేందుకు, వరి, మొక్కజొన్న, జొన్న పంటల మిగులు గడ్డిని ప్రభుత్వాలే కొనుగోలు చేసి, ఉచితంగా పశుగ్రాసంగా పంపిణీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


