వేములవాడ, 12 November
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన చేయూత పింఛన్ పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థికంగా అండగా ఈ పింఛన్ అందిస్తోంది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగర్వాల్, ఆర్డీవో బి.కుమారి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఇతర ప్రజాప్రతినిధులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ విషయంలో ముందు వరుసలో ఉందని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, వారి శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారని తెలిపారు. చేయూత పింఛన్ పథకం పేదలు, వృద్ధులు, దివ్యాంగులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే గొప్ప సంక్షేమ కార్యక్రమమని అన్నారు. భర్తను కోల్పోయి కుటుంబ బాధ్యతలను ఒంటరిగా నిర్వహిస్తున్న వితంతు మహిళలకు, కుటుంబ అండదండలు లేకుండా జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళలకు ఈ పింఛన్లు ఎంతో తోడ్పాటును అందిస్తాయని, మహిళలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకుండా ప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని తెలిపారు.
అర్హులైన ప్రతి వితంతువు, ఒంటరి మహిళకు, దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు. పింఛన్ ద్వారా లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక సహాయం అందడం వారి జీవనానికి భరోసానిస్తుందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ లోకేష్, మేనేజర్ సంపత్ రెడ్డి, ఎంపీడీవోలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, వివిధ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.






