చిన్నకోడూరు (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 13
కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. లో జరిగిన వో లీడర్స్ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనెల 19న సిద్దిపేటలో జరిగే బహిరంగ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో ఏర్పాటుచేసిన వో లీడర్స్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈనెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సబ్బండా వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించబోయే ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల ప్రారంభోత్సవ కార్యక్రమ బహిరంగ సభకు మండలం నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించిన కోటి మంది మహిళల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, లు కొమురయ్య, శ్రీనివాస్ రెడ్డి, వైకుంఠం, రాజు కుమార్, లు, వో సంఘాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.






