జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, గర్భాలయ నిర్మాణానికి వినియోగించనున్న కృష్ణశిలకు శనివారం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధికి రూ.354 కోట్లు మంజూరు చేసింది.
జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం గర్భాలయ నిర్మాణానికి వినియోగించనున్న కృష్ణశిలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో వేద పండితుల వైదిక బృందం కృష్ణశిలకు ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం రూ.354 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రధాన గర్భాలయ నిర్మాణానికి ఆలయ నిర్మాణ దాత సురపునేని సునంద పద్మప్రియ సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, ఇతర అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












