నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ర్యాడ శ్రీ అని అనే విద్యార్థిని, బాలచెలిమి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీలో తన కలిసి ఉంటే కలదు సుఖం అనే కథకు బహుమతి సాధించారు. ఈ విజయం ద్వారా ఆమె పాఠశాలకు, జిల్లాకు పేరు తెచ్చారు.
బాలచెలిమి పత్రిక ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా ఈ జాతీయస్థాయి కథల పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 252 కథలు ఈ పోటీలకు అందాయని నిర్వాహకులు డాక్టర్ వేద కుమార్, గరిపెల్లి అశోక్ లు తెలిపారు. ఈ పోటీల్లో ర్యాడ శ్రీ అని రాసిన కలిసి ఉంటే కలదు సుఖం అనే కథ ఉత్తమంగా ఎంపికైంది.
మారుమూల ప్రాంతానికి చెందిన కుకునూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో సాహిత్య సృజనను ప్రోత్సహించడం అభినందనీయం. కథ, కవిత, లేఖ, సంభాషణ, పద్యం వంటి వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ పతాని గంగాధర్ ను ప్రధానోపాధ్యాయులు టీ.హరిచరణ్, తోటి ఉపాధ్యాయ బృందం అభినందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పతాని గంగాధర్, శ్రీధర్ రావు, మల్కన్నా, చరణ్ దాస్, నాగరాజు, రవీంధర్, హరిత, భారతి, అశోక్, అటెండర్ గంగమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.











