లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ బాసర నుంచి శబరిమల వరకు చేపట్టిన అయ్యప్ప మహా పాదయాత్ర నాలుగోసారి ప్రారంభమైంది. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇందూర్ (నిర్మల్, నిజామాబాద్) ఆధ్వర్యంలో సునీల్ దత్ గురుస్వామి నేతృత్వంలో ఈ యాత్ర మొదలైంది. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ పాదయాత్రను ప్రారంభించారు.
అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇందూర్ (నిర్మల్, నిజామాబాద్) ఆధ్వర్యంలో సునీల్ దత్ గురుస్వామి నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర నాలుగోసారి విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు మేలు జరిగి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.












