ముంబై ములుండ్ ఈస్ట్‌లో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో తెలుగు సేవా సంఘం (టిఎస్ఎస్) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముంబైలోని పలు ప్రాంతాల నుంచి తెలుగు సమాజ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళల వైభవం ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో నృత్య పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించడంతో పాటు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. లక్కీ డ్రా ద్వారా విజేతలకు చీరలను, నృత్య, ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ ను ప్రముఖ అతిథిగా విచ్చేసిన జర్నలిస్ట్ సిరిమల్లె శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని టిఎస్ఎస్ అధ్యక్షుడు మల్లేష్ చిట్యాల, కార్యదర్శి బాబు బాపరబు, కోశాధికారి రాములు బోయిని మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ఆనంద్ గౌరి, సహాయ కోశాధికారి శరణప్ప ఆవటి, సభ్యులు నర్సయ్య కొమ్ము, బాబు చిట్యల, భీమ ధమ్మా, లక్ష్మణ్ బాపరబు, మల్లేష్ కొమ్ము, లోకేష్ బాపరబు, తిరుపతి లింగంపల్లి, సత్య పారనంది, మాధవి చిట్టీయాల, తిరుపత బోయిని, నైనా బాపరబు, భావ్య బాపరబు, రేణుక చిట్యాల, రేణుక లింగంపల్లి, ప్రభావతి ఆవటి తదితర సభ్యులు పాల్గొన్నారు.











