కామారెడ్డి జిల్లా నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి సోమవారం పెద్దసంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు డా. ఆనంద్‌రావు ఆధ్వర్యంలో ఈ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.
ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డా. ఆనంద్‌రావు తెలిపారు. మండలం హాంగర్గ గ్రామానికి చెందిన డా. ఆనంద్‌రావు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ సామాజిక సమానత్వాన్ని సాధించడంతో పాటు బౌద్ధ ధర్మంలోని విలువలను ప్రజల్లో విస్తరించేందుకు దీక్షాభూమి స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని ఆయన అన్నారు. ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనడం సంతోషంగా ఉందని డా. ఆనంద్‌రావు తెలిపారు.










