బొంకన్‌పల్లిలో కమలమ్మ మృతి.. కుటుంబ సభ్యులకు విఠల్‌రావు పరామర్శ
మాక్లూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బొంకన్పల్లి గ్రామానికి చెందిన కమలమ్మ (85) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
మృతురాలి అల్లుడు, గ్రామ సర్పంచ్ వి. మధుకర్‌రావు, కుమారుడు కె. రమణారావులను కలిసి కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో డాక్టర్ డి. జీవన్‌రావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, దాదన్నగారి మధుసూదన్‌రావు (మాజీ పీపీ), వినాయకరావు, ఎం. పేపశ్వర్రావు, బి. సుదర్శన్‌రావు, వెంకటేశ్వర్రావు, దాదన్నగారి జలందర్రావు, టోట్లి జలందర్రావు తదితరులు పాల్గొన్నారు.











