యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అదృశ్యమైన వలస కార్మికుడు తమ్మరాసి సాయినాథ్ కుటుంబానికి మానవతా దృక్పథంతో అండగా నిలిచేందుకు నిర్మల్ జిల్లా కార్యాలయంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ సహాయ లేబర్ కమీషనర్ ఇప్ప ముత్యంరెడ్డి సాయినాథ్ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అదృశ్యమైన వలస కార్మికుడు తమ్మరాసి సాయినాథ్ కుటుంబానికి మానవతా దృక్పథంతో అండగా నిలిచేందుకు నిర్మల్ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ సహాయ లేబర్ కమీషనర్ ఇప్ప ముత్యంరెడ్డి సాయినాథ్ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, సహాయ లేబర్ అధికారి రాజలింగు, అధ్యక్షులు గడ్చంద నరేందర్, గల్ఫ్ రిటని ఫాసియోద్ధిన్ పాల్గొన్నారు.
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అదృశ్యమైన కార్మికుల కుటుంబాలు అనేక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సహాయ లేబర్ కమీషనర్ ముత్యంరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
ముఖ్యంగా తండ్రి ఆచూకీ తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు కార్మిక శాఖ అధికారి అండగా నిలవడం అభినందనీయమని స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు.
తమ్మరాసి సాయినాథ్ కుటుంబ సభ్యులుగా తమ్ముడు సతీష్, భార్య, పిల్లలు ఉన్నారు.











