నిర్మల్ జిల్లా మండలంలోని ఝరి బి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పౌనం సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి సాయన్న నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని ఝరి బి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పౌనం సాయన్న కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి, ఝరి బి గ్రామంలోని సాయన్న నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సాయన్న కుటుంబ సభ్యులైన రాందాస్, ప్రమోద్, శివాజీ, ప్రకాష్‌లను కలిసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర భాయి రాజన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉత్తమ్ భలేరావ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసం బాబు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల దేవదాస్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మౌలాఖాన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












