మండలంలోని ఆలూరు గ్రామంలో గంగపుత్ర సంఘానికి నూతన అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో గోనుగొప్పుల రవి నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన రవిని పలువురు సంఘ నాయకులు అభినందించారు.
ఆలూరు గ్రామంలో జరిగిన గంగపుత్ర సంఘం ఎన్నికల్లో గోనుగొప్పుల రవి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని సంఘ నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో గంగపుత్ర సంఘం నాయకులు నరహరి, పోశెట్టి, చిన్న పోశెట్టి, గంగాధర్, నర్సయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గోనుగొప్పుల రవి మాట్లాడుతూ, సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.











