నిర్మల్ జిల్లా మండల కేంద్రానికి చెందిన డాక్టర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్, డాక్టర్ రాజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బైంసా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హెచ్. పుండలిక్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు గోవింద్ పటేల్, శివరాం చంద్రే, లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ మధు పటేల్, అటల్ దేవిదాస్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వారు డాక్టర్ రాజేశ్వర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.












