మండలం లోని పాంగ్రి గ్రామానికి చెందిన సర్పంచ్ ఆకాష్ పాటిల్ తల్లి అనూష బాయి మృతి పట్ల మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పాంగ్రి సర్పంచ్ ఆకాష్ పాటిల్ తల్లి, లక్ష్మణ్ పటేల్ సతీమణి అయిన అనూష బాయి పరమపదించిన విషయం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. వీరి వెంట ముధోల్ మాజీ మండల అధ్యక్షులు సుభాష్ జాదవ్, గ్రామస్తులు ఉన్నారు.











