మండలం ఝరి బి గ్రామంలోని గుర్ల భోజన్న కుటుంబాన్ని ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు.
మండలం ఝరి బి గ్రామానికి చెందిన గుర్ల భోజన్న కుటుంబాన్ని ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి పరామర్శించారు. ఈ సందర్భంగా భోజన్న భార్య సావిత్రిబాయి, కుమారులు గుర్ల దర్శన్, అశోక్, దినేష్ సాయన్న, లక్ష్మణ్, చిన్న సాయన్న, మాధవ్ రావు కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన డాక్టర్ పడకంటి రమాదేవి వారికి మనోధైర్యం కల్పించారు. కష్టసమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని డాక్టర్ పడకంటి రమాదేవి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కమల బాయి బాబన్న, అక్షయ్ పటేల్, గంగాభూషణ్, సాయినాథ్, వార్డు సభ్యులు బొడ్డోళ్ళ శంకర్, బీఆర్ఎస్ నాయకుడు బొడ్డోళ్ళ నాగన్న, బొడ్డెవాడ్ చంద్రకాంత్, బొడ్డోళ్ళ సాయినాథ్, జె. రాందాస్, టి. అనిల్, రామదాసు డాగే శంకర్, బి. గణేష్, గంగాధర్, దశరథ్, జె.సాయినాథ్, ఏం శివ దాస్, బండు ఎస్.సాయినాథ్, ఏం దిగంబర్, వినోద్ పటేల్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.











