నిర్మల్ జిల్లా మండలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సహకరించిన ప్రజలకు ఎస్సై షేక్ జుబేర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మండలంలో ఐదు రోజుల గణేష్ నిమజ్జనాల నుంచి 11 రోజుల గణేష్ నిమజ్జనాల వరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు, యూత్ సభ్యులకు ఎస్సై షేక్ జుబేర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించారని ఎస్సై షేక్ జుబేర్ అన్నారు. ముఖ్యంగా యువకులు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.
ఇదే విధంగా రానున్న నవరాత్రి ఉత్సవాల్లో కూడా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని ఎస్సై షేక్ జుబేర్ కోరారు. పండుగలను సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.











