మండలంలోని చాతా గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పూజారి లక్ష్మణ్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన గొప్ప వీరవనిత అని కొనియాడారు.
ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాజుల దేవేందర్, ఉప సర్పంచ్ దార్కోజి రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ కట్ట సుభాష్, ఉపాధ్యాయులు దేశెట్టి వెంకటేశ్వర్, విరేష్, పంచాయతీ కార్యదర్శి సాయినాథ్, కారోబారి చిన్నన్న, అభిలాష్, రజక సంఘ సభ్యులు భూమేష్, అంజయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్, భూమయ్య తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











