మండలం బీరవెల్లీ గ్రామంలోని భారతి యు.పి. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వెల్మల స్వప్నను నిర్మల్ జిల్లా తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తించి అవార్డుతో సత్కరించింది. ఈమె సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
సారంగాపూర్ మండలం బీరవెల్లీ గ్రామంలోని భారతి యు.పి. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వెల్మల స్వప్నను, జిల్లాలోని తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వరించింది.
ఉపాధ్యాయురాలిగా ఆమె విద్యార్థులకు అందించిన సేవలను పాఠశాల కరస్పాండెంట్ అయిటి పోశెట్టి, ప్రధానోపాధ్యాయుడు నిమ్మల నర్సయ్య కొనియాడారు.
సృజనాత్మక బోధన
సృజనాత్మక బోధన, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించిన ఆమెను తోటి ఉపాధ్యాయునులైన ప్రణీత, స్రవంతి, భవాని, వరలక్ష్మి, రోజా, వైష్ణవి, లక్ష్మి అభినందించారు.












