నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా లోని పాలజ్ గ్రామంలో కొలువైన ప్రసిద్ధ కర్ర గణనాథుడిని ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు మోహన్‌రావు పాటిల్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుడికి హారతి సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు విఘ్నేశ్వరుడి జ్ఞాపికను అందజేసి, శాలువాతో మోహన్‌రావు పాటిల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు పాటిల్ మాట్లాడుతూ, పాలజ్ గణనాథుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కర్ర విగ్రహంగా కొలువుదీరిన ఇక్కడి గణనాథుడు ఎంతో ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారని తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి విఘ్నాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు మనోజ్ పాపిన్వార్తో పాటు పలువురు పాల్గొన్నారు.
పాలజ్ కర్ర గణనాథుడిని దర్శించుకున్న బీజేపీ నాయకుడు మోహన్‌రావు పాటిల్
Share:

సారాంశం
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుడి జ్ఞాపికను అందుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్
ముఖ్య విషయాలు
- నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా లోని పాలజ్ గ్రామంలో కొలువైన ప్రసిద్ధ కర్ర గణనాథుడిని ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు మోహన్‌రావు పాటిల్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
- అనంతరం ఆలయ నిర్వాహకులు విఘ్నేశ్వరుడి జ్ఞాపికను అందజేసి, శాలువాతో మోహన్‌రావు పాటిల్‌ను ఘనంగా సన్మానించారు.
- ఈ సందర్భంగా మోహన్‌రావు పాటిల్ మాట్లాడుతూ, పాలజ్ గణనాథుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
- తెలంగాణ, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారని తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3772ఆర్టికల్స్
4,63,534వ్యూస్









