గో సంస్కృతి, గోవుల ప్రాధాన్యం, గో సేవపై సమాజంలో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా గో సేవా విభాగంతెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో విజ్ఞాన పరీక్షలకు విశేష స్పందన జిల్లా గో సేవా ప్రముఖ్ కొత్తకాపు నారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో గో విజ్ఞాన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. పరీక్షలు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో పాఠశాల స్థాయి, రెండో దశలో జిల్లా స్థాయి, మూడో దశలో రాష్ట్ర స్థాయి పరీక్షను హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేల నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరైన ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందజేస్తామని చెప్పారు.
ఆరో తరగతి నుంచి పై తరగతులు చదువుతున్న విద్యార్థులతో పాటు 10 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల ప్రజలు ఈ పరీక్షల్లో పాల్గొనాలని కోరారు. భారతీయ గో సంస్కృతి విశిష్టతను భావితరాలకు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో భైంసా నగర గో సేవా ప్రముఖ్ నంగి దత్తు, పతంజలి యోగా పీఠం జిల్లా ప్రభారీ గాదేవార్ గణపతి తదితరులు పాల్గొన్నారు.











