సూర్యనగర్, అల్వాల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
మద్యం మత్తులో భార్యతో గొడవపడి, ఆరు నెలల గర్భిణీ అయిన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆరు నెలల గర్భిణీ భార్యను హత్య చేసిన భర్త అల్వాల్: మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఆరు నెలల గర్భిణీ అయిన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యనగర్కు చెందిన శివానిని పరశురామ్ ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న పరశురామ్ ఆదివారం రాత్రి మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆరు నెలల గర్భిణీ అయిన శివాని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శివాని బాత్రూంలో జారిపడిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు పరశురామ్ను విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












