వేములవాడ, 17 October
ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నం పెట్టడం గొప్ప పుణ్యమని మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. దాతల సహకారంతో ట్రస్టు ఆధ్వర్యంలో 2017 రోజులుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక టీటీడీ ధర్మశాల, రాజన్న భీమన్న ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదానం నిర్వహించారు.
ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపునిండా అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదని మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు నిర్వాహకులు పేర్కొన్నారు. దాతల సహకారంతో ట్రస్టు ఆధ్వర్యంలో 2017 రోజులుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక టీటీడీ ధర్మశాల, రాజన్న భీమన్న ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పేదలకు అన్నదానం చేస్తే ఆయువు, బలం, తేజస్సు, కీర్తి పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావుస్నేహలత, ప్రతాప్స్వప్న, సంపత్నగుబోతు రవీందర్జ్యోతి, గణాచారి మఠం శైలజసాంబశివు, దేవరాజుఉమ, బాలచందర్రాజు దంపతులు, రామడుగు శ్రీలత, వారి కుమారులు, కోడళ్లు ప్రజ్ఞ, శరత్చంద్ర, శిరీష, సాయిచంద్ర, శర్వాణి, రవిచంద్ర, హైదరాబాద్‌కు చెందిన చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ తదితరులు ఉన్నారని తెలిపారు. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర శుభకార్యాల సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఒకరోజు అన్నదానం చేయాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని కోరారు. వివరాలకు 9246939388 నంబర్‌ను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, ప్రతాప్, నటరాజు, పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.











